![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ఎపిసోడ్ కి "మా ఇంటి బంగారం "మూవీ టీమ్ వచ్చింది. ఇక ఇందులో సామ్ విత్ శ్రీముఖి ఇంటర్వ్యూ అందరినీ ఆకట్టుకుంది. అలాగే ప్రదీప్ స్పెషల్ హోస్ట్ గా వచ్చాడు. ఇన్నాళ్లు హోస్ట్ గా ఉన్నారు ఆ సినిమాలో సమంత గారితో నటించడం ఎలా అనిపించింది అని అడిగాడు ప్రదీప్. "కొత్తగా అనిపించింది. సమంత గారి పక్కన ఇంకో కోడలు పిల్లగా అన్నప్పుడు ఐనా ఆవిడని హైలైట్ చేస్తారు మమ్మల్ని తొక్కేస్తారు ఎం కనిపిస్తాంలే అనుకున్నాను.
అలా కథంతా విన్నాను. సమంత గారిని ఫస్ట్ డే అలా సెట్ లో చూసాక ఓ మై గాడ్" అని అంది శ్రీముఖి. "మీ క్యారెక్టర్ గురించి చెప్పండి " అని సమంత అడిగారు. "బేసిక్ గా శ్రీముఖి అంటే ఏంటి అది కాదు." అని శ్రీముఖి అనేసరికి "కచ్చితంగా అది మా అందరికీ తెలుసు" అన్నారు సామ్. "వంటలు అంత గ్రేట్ గా వండడం రాదు, పిండి వంటలు అసలు రావు, ముగ్గులు వేయడం రాదు." అని చెప్పింది శ్రీముఖి. "అసలు ఆవిడ బంగారం అని మీకు ఎలా అనిపించింది" అంటూ సామ్ డైరెక్టర్ నందిని రెడ్డిని అడిగారు. "శ్రీముఖిని చూసినప్పుడల్లా ఒక తెలుగింటి అమ్మాయిలా అనిపించేది అలాగే చాలా ఎనర్జీ ఆమెలో కనిపించేది.
సామ్ ఎనెర్జీతో మ్యాచ్ అవ్వాలి స్క్రీన్ మీద. అలాగే క్యారెక్టర్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా అవసరం. ఐతే శ్రీముఖికి తన టాలెంట్ కి తగ్గ రోల్ రాలేదు" అంటూ నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అనేవి ఈ మధ్య రావడమే లేదు. ఐతే నందిని రెడ్డి ఇప్పుడు ఇద్దరు కాదు స్ట్రాంగ్ లేడీస్ అందరితో కలిపి ఒక ఇంటరెస్టింగ్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు.
![]() |
![]() |